మన తండ్రి క్రియ జరిగించు దినము
మన తండ్రి కార్యం చేసే ఆ ఒక్క దినాన రెండు భవిష్యత్తులు: గర్విష్ఠులు కొయ్యకాలువలె కాలిపోతారు, ఆయన నామానికి భయపడేవారు శాలలో నుండి విడిచిపెట్టిన దూడలవలె గంతులు వేస్తూ బయలుదేరుతారు. మొదట ఏలీయా వాగ్దానం చేయబడ్డాడు — తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు, పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు త్రిప్పడానికి పంపబడతాడు.
4 1ఇదిగో—కొలిమివలె మండుచున్న ఒక దినము వచ్చుచున్నది; అప్పుడు గర్విష్ఠులందరును, దుష్క్రియ చేయు ప్రతివాడును కొయ్యకాలువలె ఉందురు; ఆ దినము వారిని కాల్చివేయును, వారికి వేరైనను చిగురైనను మిగులకుండ చేయును, అని పరలోకపు సైన్యములకు అధిపతియైన తండ్రి సెలవిచ్చుచున్నాడు. 2అయితే నా నామమునకు భయపడు మీకైతే నీతిసూర్యుడు ఉదయించును; ఆయన రెక్కలలో స్వస్థత ఉండును; మీరు కొట్టములోనుండి వెడలివచ్చు దూడలవలె గంతులు వేయుచు బయటికి వత్తురు. 3నేను క్రియ జరిగించు దినమున దుష్టులు మీ అరకాళ్ల క్రింద బూడిదగా ఉందురు గనుక మీరు వారిని త్రొక్కివేయుదురు, అని పరలోకపు సైన్యములకు అధిపతియైన తండ్రి సెలవిచ్చుచున్నాడు.
4"హోరేబునొద్ద ఇశ్రాయేలీయులందరి నిమిత్తము నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలను, న్యాయవిధులను, అతని ధర్మశాస్త్రమును జ్ఞాపకము చేసికొనుడి.
5ఇదిగో, మన తండ్రి యొక్క గొప్పదియు భయంకరమైనదియునైన దినము రాకమునుపు నేను ప్రవక్తయైన ఏలీయాను మీయొద్దకు పంపుదును. a a v5 ఇక్కడ వాగ్దానము చేయబడిన ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహానేయని, ఆయనకొరకు హృదయములను సిద్ధపరచుటకు వచ్చినవాడాతడేయని యేసు తెలియజేసెను (మత్తయి 11:14; 17:10-13). 6నేను వచ్చి దేశమును సర్వనాశనముతో కొట్టివేయకుండునట్లు, అతడు తండ్రుల హృదయములను వారి పిల్లల వైపునకును, పిల్లల హృదయములను వారి తండ్రుల వైపునకును త్రిప్పును."