నీ నామము ఎంత ఘనమైనది
For the director of music: according to the Gittith. A psalm of David.
8 1 మన సర్వాధిపతి తండ్రీ, భూమి అంతటిలో నీ నామము ఎంత ఘనమైనది! నీ మహిమను నిలిపావు ఆకాశాలకు పైగా. 2 పసిపిల్లల నోటినుండియు పాలుత్రాగు శిశువుల నోటినుండియు నీ శత్రువుల నిమిత్తము, శత్రువును పగతీర్చుకొనువానిని మౌనము చేయుటకు, నీవు బలమును స్థాపించావు. 3 నీ ఆకాశములను నేను చూచునప్పుడు, నీ వ్రేళ్ల పనియైన, చంద్రుని నక్షత్రములను నీవు నిలిపిన, 4 నీవు జ్ఞాపకము చేసికొనుటకు మనుష్యుడు ఏపాటివాడు అతనిని, మనుష్యకుమారుని నీవు లక్ష్యపెట్టుటకు అతడేపాటివాడు? a a v4 హెబ్రీయుల గ్రంథకర్త ఈ మాటలను యేసుకు అన్వయించుచున్నాడు — కొంతకాలము దూతలకంటె తక్కువవానిగా చేయబడి, ఆ తరువాత మహిమతోను ఘనతతోను కిరీటము ధరింపజేయబడిన మనుష్యకుమారునికి (హెబ్రీయులు 2:6-9). 5 అయినను నీవు అతనిని దేవదూతలకంటె కొంచెము తక్కువవానిగా చేసి, మహిమతోను ఘనతతోను అతనికి కిరీటము ధరింపజేసావు. 6 నీ చేతిపనులమీద నీవు అతనికి అధికారము అనుగ్రహించావు; సమస్తమును అతని పాదముల క్రింద ఉంచావు: 7 గొఱ్ఱెలన్నియు ఎద్దులన్నియు, అడవి జంతువులును, 8 ఆకాశపక్షులును, సముద్ర మత్స్యములును, సముద్రమార్గములలో సంచరించునవి యన్నియును. 9 మన సర్వాధిపతి తండ్రీ, భూమి అంతటిలో నీ నామము ఎంత ఘనమైనది!