గొప్పలు చెప్పుకొనే నాలుక
For the director of music. A wisdom psalm of David. When Doeg the Edomite came and told Saul, "David has gone to the house of Ahimelech."
52 1 చెడు గురించి నీవెందుకు గొప్పలు చెప్పుకొంటున్నావు, బలవంతుడా? మన తండ్రి నిబంధనా కృప దినమంతా నిలిచియుండును.
2 నీ నాలుక నాశనమును పన్నుతుంది, పదునుపెట్టిన మంగలికత్తివలె, ఓ మోసగాడా. 3 మంచికంటె చెడును, న్యాయమైనది పలుకుటకంటె అబద్ధమాడుటను నీవు ఎక్కువగా ప్రేమిస్తావు. సెలా.
4 మోసపు నాలుకా, మ్రింగివేయు ప్రతి మాటను నీవు ప్రేమిస్తావు. 5 అయితే మన తండ్రి నిన్ను శాశ్వతంగా కూలద్రోయును; ఆయన నిన్ను పట్టుకొని నీ గుడారములోనుండి లాగివేయును; సజీవుల భూమిలోనుండి ఆయన నిన్ను వేళ్ళతో పెరికివేయును. సెలా.
6 నీతిమంతులు చూచి భయపడుదురు; వారు అతనిని చూచి నవ్వుచు ఇట్లందురు, 7 "మన తండ్రిని తన ఆశ్రయముగా చేసికొనని మనుష్యుని చూడుడి, అతడు తన విస్తారమైన ధనమును నమ్ముకొని ఇతరులను నాశనము చేయుటవలన బలము పొందెను." 8 అయితే నేను మన తండ్రి మందిరములో పచ్చగా ఎదుగుచున్న ఒలీవ చెట్టువలె ఉన్నాను; మన తండ్రి నిబంధనా కృపను నేను నిత్యము నిరంతరము నమ్ముకొందును. 9 నీవు చేసినదానినిబట్టి నేను నిన్ను నిత్యము స్తుతించెదను; నీ భక్తుల సన్నిధిలో నీ నామముపై నేను నా నిరీక్షణ ఉంచెదను, అది ఉత్తమమైనది గనుక.