చదవండి. స్వీకరించండి. సిఫార్సు చేయండి.

♥ సమీక్షలు

కీర్తనలు 114

గ్రంథం

ఇశ్రాయేలు ఐగుప్తునుండి బయలుదేరుట

Chapter 114.

ఇశ్రాయేలు ఐగుప్తునుండి బయలుదేరినప్పుడు, యాకోబు వంశము అన్యభాష మాట్లాడు ప్రజలనుండి బయలుదేరినప్పుడు, యూదా మన తండ్రి పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయన అధికార రాజ్యమాయెను.

సముద్రము చూచి పారిపోయెను; యొర్దాను వెనుకకు మళ్లెను. పర్వతములు పొట్టేళ్లవలె గంతులు వేసెను, కొండలు గొఱ్ఱెపిల్లలవలె గంతులు వేసెను.

సముద్రమా, నీవెందుకు పారిపోతివి? యొర్దానూ, నీవెందుకు వెనుకకు మళ్లితివి? పర్వతములారా, మీరెందుకు పొట్టేళ్లవలె గంతులు వేసితిరి? కొండలారా, గొఱ్ఱెపిల్లలవలె ఎందుకు గంతులు వేసితిరి?

భూమీ, సర్వాధిపతియైన తండ్రి సన్నిధిని వణకుము, యాకోబు మన తండ్రి సన్నిధిని వణకుము, ఆయన బండను మడువుగా నీటి మడువుగా, చెకుముకిరాతిని ప్రవహించు ఊటగా మార్చెను.

A young man reading the Father's Heart Bible print edition in a coffee shop ఇప్పుడు ముద్రణలో

వ్యాఖ్యలు

ఈ అధ్యాయం మీలో రేకెత్తించిన ఆలోచనలు, ప్రశ్నలు లేదా ఒక మాట — ఇక్కడ పంచుకోండి. ప్రతి వ్యాఖ్య మీ పేరును సహకారుల గోడపై చేర్చుతుంది.

చదవడం, వినడం, కాపీ చేయడం, పంచుకోవడం అందరికీ అందుబాటులో ఉన్నాయి — ఖాతా అవసరం లేదు. వ్యాఖ్యానించడం, హైలైట్ చేయడం, మీ స్థానాన్ని గుర్తు పెట్టుకోవడం ఉచిత ఖాతాతో వస్తాయి, మరియు ప్రతి వ్యాఖ్య మీ పేరును సహకారుల గోడపై చేర్చుతుంది.

కుటుంబంలో చేరండి — ఇది ఉచితం →
  • ఇంకా వ్యాఖ్యలు లేవు. మీ స్వరాన్ని జోడించిన మొదటివారు కండి.