మొర్దెకై ఘనత
10 1 అహష్వేరోషు రాజు దేశము మీదను, సముద్రతీర ప్రాంతముల మీదను కప్పము విధించెను. 2 అతని పరాక్రమ కార్యములన్నియు, అతని బలమును, రాజు మొర్దెకైని ఏ ఘనతకు హెచ్చించెనో ఆ ఘనత యొక్క సంపూర్ణ వివరమును, మాదీయ పారసీక దేశముల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడలేదా? 3 యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజునకు ద్వితీయుడై, యూదులలో గొప్పవాడై, తన సహోదరుల సమూహమునకు ఇష్టుడై, తన జనుల క్షేమమును వెదకుచు, తన బంధువులందరితో సమాధానముగా మాటలాడుచు ఉండెను.